ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతుల నగదు చెల్లింపులో జాప్యం తగదు: పవన్

రైతులు నుంచి ధాన్యం కొనుగోలు చేసి నగదు చెల్లించకపోవటం దారుణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రైతులకు తక్షణం బకాయిలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు ఇప్పటివరకు రూ.610.86 కోట్లు చెల్లించాల్సి ఉందని... రైతులు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

By

Published : Jul 1, 2019, 4:50 PM IST

pawan

రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం.... వారికి నగదు చెల్లింపులో జాప్యం చేయడం సబబు కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రైతులకు చెల్లించాల్సిన నిధులు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచకుండా... వ్యవసాయ శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఖరీఫ్ పనులు మొదలైన తరుణంలో ధాన్యం అమ్మిన సొమ్ము రాకపోవడం రైతులకు ఇబ్బందిగా మారిందని వివరించారు. ఈ పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించాలని కోరారు. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేయకుండా... ప్రశాంతంగా వ్యవసాయం చేసుకునేలా చేయాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details