ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్పందన కాల్​సెంటర్​కు 16 వేలకు పైగా ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్​ఫ్రీ నంబర్ 1902కు లాక్​డౌన్ వేళ భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. వీటిల్లో అధిక శాతం నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయానికి సంబంధించినవే. అలాగే పేదలకు రాష్ట్రప్రభుత్వం అందజేస్తోన్న 1000 రూపాయలకు సంబంధి కూడా ఎక్కువ ఫిర్యాదులు అందుతున్నాయి.

spandana call center
spandana call center

By

Published : Apr 14, 2020, 3:01 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కాల్ సెంటర్ 1902కు సోమవారం వరకు 16,550 ఫిర్యాదులు అందాయని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్, కోవిడ్-19 రాష్ట్ర టాస్క్​ఫోర్స్ సభ్యుడు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. వాటిల్లో 13,910 ఫిర్యాదులను పరిష్కరించామని.... 2,640 ఫిర్యాదులు పెండింగ్​లో ఉన్నట్లు వెల్లడించారు.

కాల్ సెంటర్​కు వచ్చిన ఫిర్యాదులను 40 విభాగాలుగా విభజించి,సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా సంబంధిత శాఖకు బదలాయిస్తున్నట్టు వివరించారు. నిత్యావసర వస్తువులు అధిక ధరకు విక్రయంపైనే కాల్​ సెంటర్​కు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. పరిష్కరించవలసిన 2,640 ఫిర్యాధుల్లో అత్యధికం ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 ఆర్థిక సహాయానికి సంబంధించినవని తెలిపారు.

ప్రధానంగా తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ సాయం అందలేదని కొందరు, తెల్లరేషన్ కార్డు లేనికారణంగా సాయం అందలేదనే వారినుంచి ఎక్కువగా వచ్చాయని అన్నారు. ఈ ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి వారికి తగిన న్యాయం చేయవలసిందిగా జిల్లా, మండల బృందాలను ప్రభుత్వం ఆదేశించినట్లు కమిషనర్​ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి:22 రోజులుగా వధువు ఇంట్లోనే 'బరాత్​ గ్యాంగ్​'

ABOUT THE AUTHOR

...view details