నందిగామలో జరిగిన ఈ నిరసనలో జీతాలు రాక అప్పులబాధ తట్టుకోలేక ప్రకాశం జిల్లా గిద్దలూరులో పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నందుకు నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ప్రభుత్వం తమను చిన్నచూపు చుస్తోందంటూ వాపోయారు. పాలకులు నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్నామనీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారి బాధను అర్థం చేసుకుని సకాలంలో జీతాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
'పాలకుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోతున్నాం' - కృష్ణా జిల్లా
కృష్ణాజిల్లా నందిగామలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది నిరసనకు దిగారు. 8 నెలల నుంచి జీతాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న సిబ్బంది