ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 7, 2020, 6:59 AM IST

ETV Bharat / state

ఎస్​ఈబీ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిఘా

విజయవాడలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ నిఘా కార్యక్రమం చేపట్టారు. ఎస్​ఈబీ ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో పది మందిని అరెస్టు చేశారు.

operation-nigha-program-in-vijayawada
ఎస్​ఈబీ ఆధ్వర్యంలో ఆపరేషన్ నిఘా

చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించడానికి విజయవాడలోని వివిధ పోలీస్​స్టేషన్ల పరిధిలో ఆపరేషన్ నిఘా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్​ఈబీ ఏడీసీపీ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని, గుట్కా, విదేశీ సిగరెట్లు విక్రయిస్తున్న ఓ వ్యక్తి, అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నగదు, చరవాణీలు, కారు, 27 టన్నుల ఇసుక, గుట్కా, విదేశీ సిగరెట్లు, మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details