ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్లోని మైలవరం వీధిబాలలకు అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, రెవెన్యూ, సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్)అధికారుల సహాయంతో పోలీసులు బాలలను గుర్తించారు. పరీక్ష చేయించుకున్న వారిలో 14 మంది బాలికలు కాగా, 17మంది బాలురు ఉన్నారు. అనంతరం చిన్నారును వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
నూజివీడు డివిజన్లో వీధిబాలలకు కరోనా పరీక్షలు - నూజివీడు డివిజన్లో 31మంది చిన్నారులకు వైద్యపరీక్షలు
రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు అధికారులు వీధిబాలలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. నూజివీడు డివిజన్లో 31మంది చిన్నారులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
నూజివీడు డివిజన్లో వీధిబాలలకు కరోనా పరీక్షలు