కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం తోటచర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకటేశ్వరరావు బాయిలర్ రైస్ మిల్లులో డ్రైవర్గా పని చేస్తున్నాడు. మిల్లులో విధులు ముగించుకొని వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఒడిశాకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి ఈ ప్రమాదం చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విధులు ముగించుకుని ఇంటికెళ్తుండగా ఢీకొన్న కారు.. వ్యక్తి మృతి - తోటచర్లలో రోడ్డు ప్రమాదం
మిల్లులో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.
అతివేగం.. ప్రాణం తీసింది