రైలు నుంచి జారిపడి వృద్ధురాలి మృతి - విజయవాడ
రైలు నుంచి జారిపడిన ఘటనలో.. ఓ వృద్ధురాలు చనిపోయింది. కృష్ణా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
old woman died
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ గూడవల్లి గ్రామ సమీపంలోని రైల్వే గేట్ దగ్గర ప్రమాదవశాత్తూ ఓ వృద్ధురాలు చనిపోయింది. రైలు నుంచి జారిపడిన ఘటనలో.. తీవ్ర గాయాలపాలైన వృద్ధురాలు.. అక్కడికక్కడే మృతి చెందింది. తిరపతి - పూరీ ఎక్స్‌ప్రెస్ రైలు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు, రైల్వే అధికారులు భావిస్తున్నారు.