ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేవాలయాలపై దాడులను సాంకేతిక పరిజ్ఞానంతో అరికడదాం'

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు గాను వాటిని అరికట్టేందుకు తీసుకునే రక్షణ చర్యలపై... కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన సదస్సు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న ఈ దాడులను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని డీఎస్పీ తెలిపారు.

nuzivedu dsp conducts Awareness seminar to prevent attacks on temples
దేవాలయాలపై దాడులను అరికట్టేందుకు అవగాహన సదస్సు

By

Published : Oct 10, 2020, 4:17 PM IST

దేవాలయాలపై దాడులు అధికమైన కారణంగా... వాటిని అరికట్టేందుకు తీసుకునే రక్షణ చర్యలపై కృష్ణా జిల్లా నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు అవగాహన సదస్సు నిర్వహించారు. వివిధ దేవాలయాలకు చెందిన సుమారు 70 మంది కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు చేస్తున్న ఈ దాడులను అరికట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుందని డీఎస్పీ తెలిపారు. పోలీసుల పర్యవేక్షణతో పాటు ఆలయాల కమిటీ సభ్యులు సైతం కొన్ని బాధ్యతలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కావని... సాయి సేవా దళ్ అధ్యక్షుడు బాలాజీ ప్రసాద్ చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details