ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు తెదేపా సభకు విస్తృత ఏర్పాట్లు - nuzeveeedu_election_prachara_sabha

కృష్ణాజిల్లా నూజివీడులో రేపు జరగనున్న తెదేపా ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లను ఏలూరు ఎంపీ మాగంటి బాబు పరిశీలించారు. సుమారు 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల సన్నాహక సభకు ప్రజలు భారీగా హాజరవుతారని నేతలు అంచనా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు హాజరుకానున్నారు.

తెదేపా ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మాగంటి

By

Published : Mar 19, 2019, 3:32 PM IST

తెదేపా ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ మాగంటి
కృష్ణాజిల్లా నూజివీడులో రేపు జరగనున్న తెదేపా ఎన్నికల ప్రచార సభకు ఏర్పాట్లను ముమ్మురం చేశారు. సభాప్రాంగణాన్ని ఏలూరు ఎంపీ మాగంటి బాబు పరిశీలించారు. నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేశ్వరావుతో సభా ప్రాంగణం కలియతిరిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్ సభను విజయవంతం చేస్తామని చెప్పారు.పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని అందరం కలిసికట్టుగా పని చేస్తున్నామని ఎంపీ తెలిపారు. ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి తెదేపా విజయానికి కృషి చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details