ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేతనాల కోసం.. ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల ఒప్పంద ఉద్యోగుల ఆందోళన - కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాల

గన్నవరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో ఒప్పంద ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు చెల్లించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ntr veterinary college outsourcing employees
ntr veterinary college outsourcing employees

By

Published : Aug 7, 2021, 5:19 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో ఒప్పంద ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. గత రెండు నెలలుగా నిలిచిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో వేతనాల జాప్యంతో కుటుంబ పోషణ భారంగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కళాశాల అసోసియేట్ డీన్ డా. రవికుమార్​కు వినతిపత్రం అందజేశారు.

కళాశాలలో మొత్తం సుమారు 250 మంది ఒప్పంద ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్నామని.. వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు. వేతనాలు చెల్లించకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details