ఎన్టీఆర్ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశారు.. కానీ, ప్రస్తుతం రాజకీయ విలువలు పడిపోయాయి.. స్వార్థ రాజకీయాలు కొనసాగుతున్నాయి.. అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్లో ఏర్పాటు చేసిన మెగా లెంజెండరీ రక్తదాన శిబిరం, మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో క్యాన్సర్ సహా కంటి, దంత, గుండె, ఎముకలు, నరాల వంటి విభాగాలకు సంబంధించిన టెస్టులు ఉచితంగా నిర్వహించనున్నారు. ఈసందర్భంగా మాట్లాడిన నారా భువనేశ్వరి... ఎన్టీఆర్ తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని తెలిపారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు సేవ చేసిన రియల్ హీరో ఎన్టీఆర్ అని ఆమె పేర్కొన్నారు.
ఎన్టీఆర్.. నిస్వార్థ సేవకు చిరునామా.. : నారా భువనేశ్వరి - స్వార్థ రాజకీయాలు
దివంగత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు నిస్వార్థ సేవకు చిరునామా అని ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విలువలు పడిపోయాయని చెప్తూ.. తెలుగు ప్రజల హృదయాల్లో ఎన్టీఆర్ చిరస్ఠాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
నారా భువనేశ్వరి