కృష్ణా జిల్లా నూజివీడులో తాగునీరు లేక జనం అల్లాడిపోతున్నారు. ఐదు రోజులుగా మున్సిపాలిటీ వారు ట్యాంకర్లతో అందించే నీరు రావడం లేదు. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కొళాయిలు పనిచేయట్లేదు. అప్పుడప్పుడూ వచ్చే వాటర్ ట్యాంకర్ కోసం ప్రజలు బిందెలు, డ్రమ్ములు రోడ్డుమీద పెట్టి ఎదురుచూస్తున్నారు. అధికారులు సకాలంలో మంచినీరు సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఓ వైపు వరదలు... మరోవైపు తాగునీటి వెతలు
ఒకపక్క వరదలతో ఊళ్లు మునిగిపోతున్నాయి. మరోపక్క తాగునీరు లేక ప్రజలు విలవిల్లాడుతున్నారు. కృష్ణా జిల్లా నూజివీడులో గుక్కెడు నీరు దొరక్క ప్రజలు అవస్థలు పడుతున్నారు.
వరదతో విలవిలా.. తాగునీటికి కటకట