విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శార్వరీ నామ సంవత్సరం ఉగాది వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రజలను అనుమతించలేదు. పంచాంగకర్త కప్పగంతుల సుబ్బరామ సోమయాజి సిద్దాంతి పంచాంగ పఠనం చేశారు. దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ మల్లాది విష్ణు, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, కమిషనరు ఎం.పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయంలో అర్చకులు, వేద పండితులు మాత్రమే హాజరై సామాజిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.