రేడియల్ క్రస్ట్ గేట్ల తయారీ, నాణ్యత, నిర్మాణం, అమరికలో జగన్ ప్రభుత్వ చర్యలతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయని తెదేపా శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. బహుళార్థసాథక ప్రాజెక్ట్ అయిన పోలవరం నిర్మాణాన్ని జగన్ ప్రభుత్వం చెక్ డ్యామ్లా, పిల్లకాలువలా భావిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్తో జగన్ చేసుకున్న చీకటి ఒప్పందంలో భాగంగానే ప్రాజెక్ట్ ఎత్తు తగ్గింపు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
'వైకాపా ప్రభుత్వ చర్యలతో పోలవరం నిర్మాణంపై నీలినీడలు' - tdp mla nimmala ramanayudu fires on ycp govy
పోలవరం ప్రాజెక్ట్ను వైకాపా ప్రభుత్వం పిల్లకాలువలా భావిస్తోందని... తెదేపా శాసనసభ పక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ చర్యలతో పోలవరం నిర్మాణంపై నీలి నీడలు కమ్ముకున్నాయని విమర్శించారు.
జగన్ అనే సుడిగుండలో పోలవరం ప్రాజెక్ట్ చిక్కుకుందని దుయ్యబట్టారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం ద్వారా నిర్మాణ వ్యయం 55వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకే పరిమితమవుతుందని.. నిర్మాణ వ్యయంలో మిగిలే 25వేల కోట్లను కొట్టేయాలన్నదే జగన్ దురాలోచన అని ధ్వజమెత్తారు. జగన్ క్విడ్ ప్రోకో విధానాలకు పోలవరాన్ని బలికానివ్వమని హెచ్చరించారు. ప్రాజెక్ట్ ను కాపాడుకోవడానికి రాష్ట్ర రైతులతో కలిసి తెలుగుదేశం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'తెదేపా అభ్యర్థులను గెలిపిస్తే అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తాం'