ఆంధ్రప్రదేశ్ లో రాత్రి పూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది(Night curfew extended in AP news). వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఈ మేరకు తాజా ఉత్తర్వులు విడుదల చేశారు.
Night curfew extended: రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే?
18:49 October 13
ఉత్తర్వులు జారీ చేసిన వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి
కొవిడ్ నిబంధనల(covid guidelines news) మేరకు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగిస్తున్న సంగతి తెేలిసిందే. ఈ కర్ఫ్యూను ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తున్నామని, అక్టోబరు 31 తేదీ వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇక.. సభలు, సమావేశాలు, వివాహాల వంటి శుభకార్యాలకు గరిష్టంగా 250 మంది వరకూ అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ తరహా వేడుకలకు, కార్యక్రమాలకు హాజరు కావాలని సూచించింది.
ఇదీ చదవండి
new cj of ap high court: హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం