ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

త్వరలో అందుబాటులోకి... కొవిడ్‌ నిర్ధరణకు కొత్త యంత్రం

తెలంగాణలో కొవిడ్‌ నిర్ధరణకు మరో కొత్త యంత్రం (కొబాస్‌ 8800 మిషన్‌) అందుబాటులోకి రానుంది. నిమ్స్‌లో ఈ యంత్రాన్ని అమర్చేందుకు రూ.కోటి వ్యయంతో ప్రత్యేక ల్యాబొరేటరీని సిద్ధం చేశారు. దీని ద్వారా ఒక్కరోజులో సుమారు 3 వేలకు పైగా ఆర్‌టీ పీసీఆర్‌ కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి వీలవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. వారం రోజుల్లో యంత్రాన్ని అమర్చి, సాధ్యమైనంత త్వరగా దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

త్వరలో అందుబాటులోకి... కొవిడ్‌ నిర్ధరణకు కొత్త యంత్రం
త్వరలో అందుబాటులోకి... కొవిడ్‌ నిర్ధరణకు కొత్త యంత్రం

By

Published : Aug 13, 2020, 12:13 PM IST

ఒక్కరోజులోనే 3వేల కొవిడ్‌ పరీక్షలు చేసే సామర్థ్యమున్న ‘కొబాస్‌ 8800’ యంత్రాన్ని వినియోగించడం తెలంగాణలో ఇదే తొలిసారి అని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ యంత్రం కొనుగోలుకు రెండు నెలల కిందటే ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా, దేశంలోకి వచ్చిన మూడు యంత్రాల్లో రాష్ట్రానికి రావాల్సిన మొదటి యంత్రాన్ని కేంద్ర ప్రభుత్వం కోల్‌కతాకు తరలించిందని ఇటీవల వైద్యమంత్రి ఈటల ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా పట్టు వదలకుండా నూతన యంత్రం కొనుగోలుకు చేసిన ప్రయత్నాలు ఫలించి, ఇటీవలే రాష్ట్రానికి యంత్రం చేరిందని వైద్యవర్గాలు తెలిపాయి. ఈ యంత్రం ఖరీదు రూ.7 కోట్లు.

యంత్రం ప్రత్యేకతలివీ!

  • కరోనా నిర్ధారణలో 4 రకాల విధానాలుంటాయి. ఒక్కసారి నమూనాను ఈ యంత్రంలో ప్రవేశపెడితే. అన్ని విధానాల్లో పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఫలితాలను కూడా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తుంది.
  • కరోనా పరీక్షలనే కాకుండా.. హెచ్‌ఐవీ, హెచ్‌పీవీ, తదితర దాదాపు 100 రకాల నిర్ధారణ పరీక్షలను చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
  • ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యంలో రోజుకు 6600 వరకూ ఆర్‌టీ పీసీఆర్‌ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణ సామర్థ్యం ఉండగా.. ఈ యంత్రం అందుబాటులోకి వస్తే నిర్ధారణ పరీక్షల సామర్థ్యం దాదాపు 10 వేలకు చేరుకుంటుంది. ప్రస్తుతం రోజుకు 24 వేల వరకు యాంటిజెన్‌ పరీక్షలు చేస్తున్నారు. మొత్తంగా పరీక్షల సంఖ్యను 40 వేలకు పెంచాలని ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ లక్ష్య సాధనకు కొత్త యంత్రం దోహదపడుతుందని భావిస్తున్నారు.

ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్‌

ABOUT THE AUTHOR

...view details