పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కోన శశిధర్ బాధ్యతలు - పౌరసరఫరాల శాఖ
పౌరసరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు కోన శశిధర్. ఆయనకు అధికారులు అభినందనలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తానని శశిధర్ తెలిపారు.
new-civil-supplies-officer
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నూతన కమిషనర్‌గా కోన శశిధర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన శశిధర్.. ఇటీవలి బదిలీల్లో పౌరసరఫరాల శాఖకు నియమితులయ్యారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ కృతికా శుక్లా, పౌరసరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది... మర్యాదపూర్వకంగా కలిసి శశిధర్‌కు అభినందనలు తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం ప్రజలకు మెరుగైన సేవలందించేలా కృషి చేస్తానని శశిధర్ తెలిపారు.