ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు - శరన్నవరాత్రి మహోత్సవాలు

శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవరోజు వివిధ అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. కృష్ణాజిల్లాల్లో లలితా త్రిపుర సుందరీదేవిగా పూజలందుకున్న అమ్మవారు... ప.గో.జిల్లా గోస్తనీ నది తీరాన అన్నపూర్ణాదేవిగా కొలువైంది.

navaratri-vedukalu

By

Published : Sep 30, 2019, 4:37 PM IST

వైభవంగా శరన్నవరాత్రి మహోత్సవాలు

రాష్ట్రవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు.. రెండవరోజు వైభవంగా కొనసాగుతున్నాయి. వివిధ అవతారాల్లో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పార్వతిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. కృష్ణాజిల్లా నూజివీడు, గుడివాడ, గుడ్లవల్లేరు, అవనిగడ్డ, భీమవరం ఆలయాల్లో లలితా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు అభిషేక పూజలు అందుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తనీ నది తీరాన అన్నపూర్ణాదేవి అలంకారంలో కొలువైన అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. తణుకులో బాలా త్రిపుర సుందరి దేవి సమక్షంలో మహిళలు అరడుగుల అగరవత్తి వెలిగించి..సామూహిక కుంకుమ పూజలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details