ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా - governor

తెదేపా సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్​ను కలిసి రాజీనామా లేఖను అందజేశారు.

నన్నపనేని రాజకుమారి

By

Published : Aug 7, 2019, 4:27 PM IST

Updated : Aug 7, 2019, 7:40 PM IST

మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ పదవికి నన్నపనేని రాజీనామా

రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాజ్​భవన్​లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం మారటంతో నైతిక బాధ్యతగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు 3 వార్షిక నివేదికలను గవర్నర్​కు అందించారు. నివేదికను పరిశీలించిన గవర్నర్​ తనను అభినందించారని నన్నపనేని వివరించారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానన్నారు. వసతి గృహల్లో భద్రత పెంచాల్సిన అవసరముందని వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.

Last Updated : Aug 7, 2019, 7:40 PM IST

ABOUT THE AUTHOR

...view details