రాష్ట్ర వ్యాప్తంగా నాగుల చవితి సందర్భంగా ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రసిద్ధ మోపిదేవి క్షేత్రంలో శ్రీవల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామివారి దర్శనానికి ప్రజలు తరలివచ్చారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడ, మచిలీపట్నం, రేపల్లె నుంచి ప్రత్యేక బస్సులు వేశారు.
మోపిదేవికి నాగుల చవితి శోభ.. భారీగా భక్తుల రాక
నాగుల చవితి సందర్భంగా కృష్ణా జిల్లా మోపిదేవి ఆలయం కిటకిటలాడుతోంది. భక్తులు పుట్టలో పాలు పోసి నాగేంద్రుని మొక్కులు తీర్చుకున్నారు.
మోపిదేవికి నాగులచవితి శోభ