వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. కృష్ణా జిల్లా తిరువూరులోని తంగేళ్లబీడులో రెవెన్యూ ఉద్యోగిని దారుణంగా హత్య చేశారు. విజయవాడ పోరంకికి చెందిన గణేశ్ అరిగిపల్లి మండలం చోడవరంలో వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పాత నేరస్తురాలైన రేణుకతో ఆయన సంబంధం పెట్టుకున్నాడు. ఈనేపథ్యంలో జరిగిన గొడవలో గణేశ్ హత్యకు గురైనట్టు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహానికి సమీపంలో కత్తిని గుర్తించారు. గతంలోనూ రేణుక పలుకేసుల్లో నిందితురాలిగా ఉందని... కొందరితో కలిసి హత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుని దగ్గర దొరికిన వివరాల ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు మృతదేహాన్ని పరిశీలించారు.
'వివాహేతర సంబంధం.. తీసింది ప్రాణం' - police case
కృష్ణా జిల్లా తిరువూరు తంగేళ్లబీడు కాలనీలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.
హత్య