కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌గా ఎం.పి.సింగ్ పేరును కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖ ఖరారు చేసినట్లు తెలిసింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కేంద్రజలసంఘం చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న ఈయనకు గత నెలాఖరులో పదోన్నతి లభించింది. ఖాళీగా ఉన్న కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా నియమితులవుతారనే ప్రచారం జరిగింది.
కానీ... దిల్లీలో కేంద్రజలసంఘం కార్యాలయంలో నియమించాలని ఆయన కోరినట్లు తెలిసింది. చివరకు కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా ఆయన్నే నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నట్లు సమాచారం. ఈ నిర్ణయానికి సంబంధించి అధికారిక ఆదేశాలు వెలువడాల్సి ఉంది.