ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూడిపూడిలో 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం - కృష్ణాజిల్లా తాజా వార్తలు

కృష్ణా జిల్లా కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్‌లో 50 శాతం ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేశారు.

కూడిపూడిలో 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం
కూడిపూడిలో 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం

By

Published : May 13, 2021, 8:38 PM IST

కృష్ణా జిల్లా కూచిపూడిలో సిలికానాంధ్ర సంజీవని ఆసుపత్రిలో 50 పడకల కొవిడ్ కేర్ సెంటర్‌ను మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ కొవిడ్ కేర్ సెంటర్‌లో 50 శాతం ఆక్సిజన్ పడకలను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ కోరారు.

అనవసరంగా ఎవరూ బయటకు రావద్దని... పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పామర్రు నియోజకవర్గంలోని ప్రతి మండలంలోనూ కొవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దాతల సహకారం తీసుకుంటామని... ఎవరైనా ముందుకు రావాలని కోరారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌, వైద్య అధికారులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details