కృష్ణా జిల్లా మోపిదేవిలోని సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయం పక్కన డ్రైనేజి సమస్య చాలా కాలంగా భక్తులను వేధిస్తోంది. గుడిలో అగరొత్తుల గుబాళింపు భక్తులకు ఆధ్యాత్మికత పంచితే.. బయటికి రాగానే భరించరాని కంపు.. ఏవగింపు కలిగిస్తోంది. ఏళ్లు గడుస్తున్నా చూసేవారే తప్ప.. ఆ కంపు కడిగే వారు, కనీసం కడిగించేవారు కరవవుతున్నారు. వేల మంది వెళ్లి వచ్చే గుడిలో కనీస వసతులు కనిపించడం లేదు. మొక్కులు తీర్చుకునే భక్తులు.. స్నానాలు చేద్దామన్నా మంచి నీరు ఉండదు. ఉప్పు నీటితోనే స్నానమాచరిస్తున్నారు ఇక్కడి భక్తులు. డ్రైనేజీ సౌకర్యం లేని దుస్థితిలో ఆలయం ఉంది. ఈ సమస్యలపై భక్తులు మండిపడుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా పరిష్కరించాలని కోరుతున్నారు.
లోపల గుబాళింపు..... బయట భరించరాని కంపు - mopidevi
రాష్ట్రంలోనే పేరున్న దేవాలయం అది. ఆ గుడిలో ప్రముఖులు పూజలు చేస్తుంటారు. ఎంతమంది వెళ్లి వచ్చినా... అక్కడి సౌకర్యాలపై మాత్రం ఎవరూ స్పందించరు. కనీస వసతుల్లేక భక్తులు పడుతున్న ఇబ్బందులు ఎవరికీ పట్టవు.
పారిశుద్ధ్యం