ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'120 ఎమ్మెల్యే, 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తాం' - tdp

ఎన్నికల సంఘం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ విధులను పక్కన పెట్టి రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని, ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

By

Published : Apr 27, 2019, 5:49 PM IST

ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్

ఎన్నికల కోడ్ ఓటింగ్ ముగిసే వరకు అమలుపరచడం సమంజసమే కానీ.. ఫలితాల వరకు అమలు చేయటం హాస్యాస్పదంగా ఉందని తెదేపా ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ అభివర్ణించారు. ప్రజలకు మేలు చేసే అనేక పనులు ఆలస్యమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య, రైతుల ధాన్యం కొనుగోలు, కరవు, ప్రకృతి వైపరీత్యాలు వంటి వాటికి అధికారులు ఏ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 120 ఎమ్మెల్యే, 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details