ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరువూరును ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా! - krishna

ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయటంలో కృషి చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి తెలిపారు.

ఎమ్మెల్యే

By

Published : May 30, 2019, 9:52 PM IST

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే లక్ష్యం

రాష్ట్రంలో తిరువూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తొలిసారి తిరువూరు వెళ్లిన ఆయనకు.. పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. స్థానిక విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు... అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చూస్తానని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details