ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండడం వల్ల ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేశారు. బ్యారేజీ నుంచి వస్తున్న వరదనీరు దిగువ గ్రామాలను ముంచెత్తుతోంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం లంక భూములన్నీ ముంపునకు గురయ్యాయి. వరదతో పంటలన్నీ నీటమునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
ముంపు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ - pamarru mla anil kumar latest news
ప్రకాశం బ్యారేజీలోకి వరద నీరు భారీగా చేరుతోంది. దీంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువకు వస్తున్న వరద నీరు లంకగ్రామాలను ముంచెత్తుతోంది. వదర నీటితో కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలంలో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఈ గ్రామాల్లో పర్యటించి పంటలను పరిశీలించారు.
ముంపు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ముంపు గ్రామాలు తోట్లవల్లూరు, పమిడిముక్కలలో పర్యటించి వరద పరిస్థితిని పరిశీలించారు. రైతులతో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. పసుపు, కంద, అరటి, తమలపాకు పైరులను పరిశీలించారు.
ఇదీ చదవండి :తెలంగాణ: సహాయక చర్యలు లేకపోతే మీ పేరు రాసి చనిపోతాం!