బాలికకు నెలలు నిండడం వల్ల ఇటీవల మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె రక్తహీనత, ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నందున విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన బాలికకు వైద్యపరీక్షలు నిర్వహించి.. గురువారం శస్త్రచికిత్స చేశారు. ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రక్తహీనత సమస్య అధికంగా ఉండడం వల్ల మరికొన్ని రోజులు వారిని ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు సూచించారు.
బాలిక తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే వారి బంధువులు పెద్దమ్మ కుటుంబం నివసిస్తుండేవారు. బాలిక తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని సమయంలో పెద్దమ్మ కొడుకు మోహన్ కుమార్ మాయమాటలు చెప్పి అనేకసార్లు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించడం వల్ల భయపడిన ఆమె.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. చిన్నారి పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు... గట్టిగా అడిగేసరికి జరిగిన విషయాన్ని బాలిక బయటపెట్టింది. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.... ఆరు నెలల గర్భవతిగా తేలింది. గర్భవిచ్ఛిత్తి చేసేందుకు అవకాశం లేకపోవడం వల్ల అప్పటి నుంచి ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.