రాష్ట్రంలో వ్యవస్థలను విధ్వంసం చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపా, సీపీఐ, జనసేన చంద్రబాబు తోక పార్టీల్లా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు అనవసరంగా లేఖలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు అధైర్యపడవద్దని, మొక్కజొన్న, టమాటా, అరటి పంటలను కొనుగోలు చేస్తామని చెప్పారు.
'ప్రభుత్వంపై బురద జల్లేందుకే చంద్రబాబు లేఖలు' - minister vellampalli srinivas
విజయవాడలో పేదలకు కూరగాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు హాజరయ్యారు. భాజపా, సీపీఐ, జనసేన పార్టీలు చంద్రబాబు అనుకూల పార్టీలుగా వ్యవహరిస్తున్నాయని వారు విమర్శించారు.
విజయవాడలో కూరగాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు