ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. లలితా త్రిపుర సుందరి దేవి రూపంలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ప్రభుత్వం ఎంతో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేవాలయంలో ప్రతిపక్షం రాజకీయాలు మాట్లాడడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
దుర్గమ్మను దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి - మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ దుర్గమ్మను రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
దుర్గమ్మను దర్శించిన మంత్రి