ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుపేదలకు కూరగాయల పంపిణీ - మంత్రి వెల్లంపల్లి వార్తలు

కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన పేదలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు కూరగాయలు పంపిణీ చేశారు.

minister vellampally distributes vegetables to needy at vijayawada
ఉపాధి కోల్పోయిన పేదలకు కూరగాయల పంపిణీ

By

Published : Apr 7, 2020, 12:30 PM IST

ఉపాధి కోల్పోయిన పేదలకు కూరగాయల పంపిణీ

లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల గడపలోకి తీసుకెళ్లి అమలు చేస్తోందన్నారు. అదే తరహాలో వర్తక సంఘాలు, ఛాంబర్ అఫ్ కామర్స్ సహకారంతో పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసున్నట్టు చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని పేదలకు వాటిని అందించారు. ప్రజలంతా కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details