గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారానికి, న్యాయం చేసేందుకు వైకాపా ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరులోని భజరంగ్ జూట్ మిల్లు కార్మికుల సమస్యలపై మంత్రి వెల్లంపల్లి అధ్యక్షతన హై లెవల్ కమిటీ సమావేశం జరిగింది.
నిష్పక్షపాతంగా కార్మికులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. సీఎం జగన్.. ఐదుగురు సభ్యులతో కూడిన హై లెవెల్ కమిటీని నియమించారని అన్నారు. జూట్ మిల్లుకు చెందిన యాజమాన్యం, కార్మికులతో కలెక్టర్, సంబంధిత అధికారులతో చర్చించారు.