జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి తీవ్ర విమర్శలు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవనిజం అంటే ప్యాకేజీకి మొగ్గు చూపడమేనని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని మంత్రి వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పరిశీలించారు. జనసేన బ్యానర్లో చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ మేరకు జనసేనాని.. విశాఖలో నటిస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క నదులన్నీ నీళ్లతో నిండి ఉంటే.. ఇసుక పేరిట రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపటమే పవన్ పనిగా పెట్టుకున్నారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఇసుక కొరత తీరబోతోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు మానుకోవాలని వైకాపా నేతలు హెచ్చరించారు.
ఇదీ చదవండి: