కృష్ణాజిల్లా ఈడుపుగల్లు పరిధిలోని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కమిషనర్ పీయుష్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నింపేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టినట్టు మంత్రి తెలిపారు. అందులో భాగంగా వాణిజ్య పన్నుల విభాగానికి 55వేల కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. పన్నుల వసూలుపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీపై కూడా అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలకు అవినీతిరహిత పాలన అందించేందుకు వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పన్ను ఎగ్గొట్టే వారిని ఎలా పట్టుకోవాలో సమీక్షలో అధికారులు చర్చించారు. కార్యాలయాల నిర్వహణకు సొంతభవనాలను సమకూర్చేందుకు ప్రయత్నిస్తామన్నారు.
వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో మంత్రి నారాయణస్వామి సమీక్ష - review meeting
రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నింపేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకున్నట్టు వాణిజ్య పన్నులశాఖ మంత్రి నారాయణస్వామి తెలిపారు.
మంత్రి నారాయణస్వామి