ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాజిస్టిక్ హబ్​కు అన్నివిధాలా సహకరిస్తాం: మేకపాటి

మల్టీమోడల్ లాజిస్టిక్ హబ్​ నిర్మాణానికి అన్నివిధాలా సహకరిస్తామని పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. లాజిస్టిక్ పార్క్ పనులపై అధికారులతో మంత్రి చర్చించారు.

By

Published : Jul 20, 2019, 3:16 PM IST

లాజిస్టిక్ హబ్​కు సాయం చేస్తాం

ఆంధ్రప్రదేశ్​లో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ పనుల పురోగతిపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. లాజిస్టిక్ హబ్​కు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. కాకినాడలో నిర్మిస్తున్న లాజిస్టిక్ హబ్ ఈ ఆర్థిక సంవత్సర చివరికల్లా పూర్తవుతుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో మచిలీపట్నం కేంద్రంగా వెయ్యి ఎకరాల్లో నిర్మించే ప్రతిపాదన ఉన్న ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ అండ్ మానుఫాక్ఛరింగ్ జోన్ ప్రాజెక్టుపైనా మంత్రి అధికారులతో చర్చించారు.

ABOUT THE AUTHOR

...view details