రాష్ట్రంలో పేదలందరికీ ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు. ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెలలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నూటికి నూరు శాతం నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు తినగలిగే రకమైన స్వర్ణ సహా అదే తరహా రకాలను రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేసేలా ప్రోత్సాహక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసినందుకు అదనంగా 500 రూపాయలు చెల్లించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్పందన కార్యక్రమంలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాలద్వారా కార్డులు మంజూరు చేస్తామని చెప్తున్న కొడాలి నానితో ఈటీవీ ముఖాముఖి.
ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీ : కొడాలి నాని
రాష్ట్రంలోని పేదలందరికీ చౌక దుకాణాల ద్వారా ఇంటింటికీ సన్న బియ్యం పంపిణీని ఏప్రిల్ నుంచి ప్రారంభిస్తామని మంత్రి కొడాలి నాని తెలిపారు.
కొడాలి నాని