కృష్ణాజిల్లా గుడివాడలో నూతనంగా ఏర్పాటు చేసిన జీవీ మాల్ వస్త్ర సముదాయాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. 'జాతిరత్నాలు' ఫేం ఫారియా జ్యోతి ప్రజ్వలన చేశారు. గుడివాడ ప్రజానీకానికి అతి తక్కువ ధరలో అన్ని రకాల వస్త్రాలు మాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని వారు సూచించారు.