విజయవాడలో ఓ మైనర్ అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 3 రోజుల క్రితం ఎంజీ రోడ్డులోని స్వరాజ్ మైదానం వద్ద ఇద్దరు యువకులు తనపై మత్తుమందు చల్లి అపహరించారని సీపీకి ఓ బాలిక ఫిర్యాదు చేసింది. మెలకువ వచ్చేసరికి ప్రకాశం బ్యారేజీకి సమీపంలోని పొలాల్లో ఉన్నానని ఫిర్యాదులో పేర్కొంది. ఆ సమయానికి తన చేయి, మెడపై గాయాలున్నట్లు తెలిపింది. తొలుత స్థానిక పోలీసులకు ఈ విషయం తెలిపినా వారు కేసు నమోదు చేయలేదని బాలిక తెలపగా.... వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని సూర్యారావుపేట పోలీసులను సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఇద్దరు ఎస్ఐలతో ఏర్పాటైన ప్రత్యేక బృందం... సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ అపహరణ కేసుపై... పోలీసులు దర్యాప్తు ముమ్మరం - minar girl kidnap in vijayawada
విజయవాడ ఎంజీ రోడ్డు సమీపంలో ఓ బాలికను గుర్తు తెలియని వ్యక్తులు మత్తుమందు చల్లి అపహరించారు.ఘటనపై మైనర్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మైనర్ అపహరణ కేసుపై... పోలీసులు దర్యాప్తు ముమ్మరం