లాక్డౌన్ కారణంగా అకలితో అలమటిస్తున్న పేదలకు.. దాతలు ఆహారం అందించారు. రెండు పూటలా భోజన వసతి ఏర్పాటు చేసిన వివిధ స్వచ్ఛంద సంస్థల సభ్యులను... కృష్ణాజిల్లా గుడివాడలో జర్నలిస్టు ఫోరం సభ్యులు.. డీఎస్పీ సత్యానందం మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్తో కలిసి సన్మానించారు. గుడివాడ డివిజన్ పరిధిలో ఒక్క కరోనా పాజిటివ్ కేసులేకుండా.. పలు విభాగాల సిబ్బంది కృషిచేశారని డీఎస్పీ సత్యానందం అన్నారు.
గుడివాడలో దాతలకు జర్నలిస్టు ఫోరం సభ్యుల సన్మానం - gudiwada latest news
లాక్డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి పలువురు దాతలు అండగా ఉంటున్నారు. వారి ఆకలి తీర్చిన దాతలకు .. కృష్ణాజిల్లా గుడివాడలో జర్నలిస్టు ఫోరం సభ్యులు సన్మానం చేశారు.
గుడివాడలో దాతలకు జర్నలిస్టు ఫోరం సభ్యుల సన్మానం