కృష్ణా జిల్లాలో వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ మాధవీలత తెలిపారు. 5 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే రెండు లక్షల టన్నుల ధాన్యం సేకరించామని వెల్లడించారు. కొత్త సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రభుత్వం, శాస్త్రవేత్తలు సూచించిన వంగడాలను సాగు చేస్తే.... మద్దతు ధరతో పాటు కొనుగోలులోనూ ఇబ్బందులు ఉండవని రైతులకు సూచించారు.
'వ్యవసాయానికి ఇబ్బందులు లేకుండా చర్యలు'
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్నా వ్యవసాయ పనులకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. కృష్ణా జిల్లాలో కరోనా వేగంగా విస్తరిస్తున్నప్పటికీ జాగ్రత్తలు పాటిస్తూ అన్నదాతలు సేద్యం చేస్తున్నారు. జిల్లాలో కర్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని జిల్లా సంయుక్త పాలనాధికారి మధవీలత తెలిపారు.
కృష్ణా జిల్లా సంయుక్త పాలనాధికారి మాధవిలత