గంజాయిని రవాణా చేస్తున్న 8 మందిని.. కృష్ణా జిల్లా తిరువూరు పోలీసులు పట్టుకున్నారు. పట్టణంలోని వాహిని ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో వీరు పట్టుబడ్డారు. నిందితులంతా 20 నుంచి 22 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారేనని పోలీసులు గుర్తించారు.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం నుంచి గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా గంజాయిని తెప్పించుకుని తిరువూరు పట్టణ పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. 3 కేజీల గంజాయి, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్ఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ అవినాష్, సిబ్బందిని.. డీఎస్పీ అభినందించారు.