ఈదురుగాలులతో మామిడి పంటకు నష్టం - nuzivedu
కృష్ణా జిల్లాలో పలుగ్రామల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మామిడి తోటలకు అపారనష్టం వాటిల్లింది.
నేలరాలిన మామిడి
కృష్ణా జిల్లా నూజివీడు మండలం సిద్దార్థ నగరం, సుంకొల్లు, వెంకటాపురం గ్రామాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మామిడి తోటలకు అపార నష్టం వాటిల్లింది. బుధవారం సాయంత్రం వీచిన గాలులకు మామిడికాయలు రాలిపోయాయి. చేతికంద వచ్చిన పంట రాలిపోవటంపై అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.