ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపరాష్ట్రపతి కోలుకోవాలని.. మందకృష్ణ ప్రార్థనలు - మందకృష్ణ మాదిగ అప్​డేట్

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా నుంచి కోలుకోవాలని కోరుతూ.. గుణదల మేరీమాత ఆలయంలో మందకృష్ణ మాదిగ ప్రార్థనలు చేశారు. వెంకయ్యనాయుడు తనకు ఎంతో సన్నిహితులనీ.. ఆయన త్వరగా కోలుకుని.. విధులు నిర్వర్తిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

manda krishna madiga special pujas for vice president
గుణదల మేరీమాత ఆలయంలో మందకృష్ణ ప్రార్థనలు

By

Published : Oct 6, 2020, 5:24 PM IST

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొవిడ్ నుంచి కోలుకోవాలని కోరుతూ.. ఎమ్​ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... గుణదల మేరీమాత గుడిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గుణదల మేరీ మాత పీఠాధిపతి తెలగతోటి జోసఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రార్థించారు. వెంకయ్య నాయుడు భారతదేశ ముద్దుబిడ్డ అనీ.. అందరికీ పెద్దన్న పాత్ర పోషించే వ్యక్తి అని అన్నారు.

ఆయన తమకు అత్యంత సన్నిహితులనీ, బడుగు, బలహీన వర్గాల శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతారని అన్నారు. వెంకయ్యనాయుడు ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. కరోనా నుంచి కోలుకొని.. ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details