విజయవాడ నగర శివారు మైలవరం వెళ్లే రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో కొత్తూరు గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నరేంద్ర కొత్తూరు నుంచి విజయవాడ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వేరే వాహనాన్ని క్రాస్ చేస్తున్న టిప్పరు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనచోదకుడు లారీ టైర్ల కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంఘటన స్ధలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ.. వ్యక్తి దుర్మరణం - man dead in road accident news update
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ప్రమాదం విజయవాడ నగర శివారు రహదారిపై చోటు చేసుకుంది. సంఘటన స్ధలానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ