ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోళ్లఫామ్​లో రేషన్ బియ్యం నిల్వ.. వ్యక్తి అరెస్టు - కృష్ణా జిల్లాలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు వార్తలు

కోళ్ల ఫామ్​లో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామంలో వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 260 బస్తాల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు.

Illegal ration rice stocks in Poultry farm
కోళ్లఫామ్​లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వలు వ్యక్తి అరెస్టు

By

Published : Dec 16, 2020, 8:00 AM IST

కృష్ణా జిల్లా నందిగామ మండలం హనుమంతుపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కోళ్ల ఫామ్​లో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకొని 96 వేలు రూపాయలు విలువ గల 260 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు. గాడిపర్తి రాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కోళ్లఫామ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details