7న ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభం: మంత్రి కొల్లు కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు ఈనెల 7న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ వేదవ్యాస్ తెలిపారు. పనుల కోసం ఉపయోగించే యంత్రాలకు మచిలీపట్నం 3 స్తంభాల కూడలి వద్ద స్వాగతం పలికారు. ఓడరేవు కలను సాకారం చేయడంలో సీఎం చంద్రబాబు కృషి చేశారని... ప్రజల కల నెరవేరబోతోందన్నారు. ఓడరేవుతోపాటు పలు అనుబంధ పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. మచిలీపట్నం మున్ముందు గత వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.