మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం అప్పగించేందుకు మార్చురీ సిబ్బంది నగదు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అవనిగడ్డకు చెందన ఓ మహిళ మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు మార్చురీ సిబ్బంది రూ. 6 వేలు డిమాండ్ చేసి... చివరకు రూ. 1500 నగదు తీసుకున్నాడు. మృతదేహాన్ని ఇచ్చేందుకు నగదు తీసుకోవటం హేయమైన చర్య అని.. అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించి మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి అధికారులు చెపుతున్నారు.
మచిలీపట్నంలో మృతదేహం అప్పగింతకు లంచం డిమాండ్... వీడియో వైరల్ - krishna district latest news
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని అప్పగించేందుకు డబ్బు డిమాండ్ చేసి వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాధితులు సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. అయితే ఇప్పటివరకూ దీనిపై ఫిర్యాదు అందలేదని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు.
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటన