మచిలీపట్నంలో క్యాండిల్ ర్యాలీ పుల్వామా ఉగ్రదాడికి నిరసనగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. చిలకలపూడి సెంటర్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో పట్టణవాసులు పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిని పిరికిపంద చర్యగా మంత్రి అభివర్ణించారు. ఈ ర్యాలీలో ఏసీపీ సాయికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.