ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎన్నేళ్లు పడుతుందో? - పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ఎన్నెళ్లు పడుతుందో?

పోలవరం రివర్స్​ టెండరింగ్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ ట్విట్టర్​లో ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు పనుల పూర్తికి ఎన్నెళ్లు పడుతుందో?

By

Published : Sep 21, 2019, 8:32 PM IST

పోలవరం రివర్స్​ టెండరింగ్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​​ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. గతంలో ఎక్కువకు టెండర్​ వేసి పనులు దక్కించుకున్న మ్యాక్స్​ ఇన్​ఫ్రా సంస్థకే మళ్లీ కట్టబెట్టారన్నారు. అవే పనులకు ఆ సంస్థ తక్కువగా బిడ్ వేసిందంటేనే​.. మతలబు ఏమిటో అర్థమవుతోందని ట్వీట్​ చేశారు. కేవలం 58 కోట్ల రూపాయలను మిగిల్చి చంకలు గుద్దుకోవడం కోసమే ఇదంతా చేస్తున్నారా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మార్చిలో పనులు దక్కించుకుని... ఒక్క శాతం పనులు కూడా పూర్తి చేయలేక చేతులెత్తేసిన సంస్థకు పనులు అప్పగించారని.... ఈ ప్రాజెక్టు ఇంకా ఎప్పటికీ పూర్తవుతుందో అంటూ ట్వీట్​లో పేర్కొన్నారు.

పోలవరం ప్రాజెక్టు పూర్తికి ఎన్నేళ్లు పడుతుందో?

ABOUT THE AUTHOR

...view details