ధ్యానం కొనుగోళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించమన్న రైతులను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బెదిరించడంపై నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. "అన్నదాతలంటే అంత అలుసా అని నిలదీశారు. అధికారమదంతో విర్రవీగుతూ రైతుల్నే బెదిరిస్తారా అని మండిపడ్డారు. అన్నదాతలు పండించిన ధాన్యాన్ని తీసుకున్న ప్రభుత్వం... మూడు నెలలైనా డబ్బులు చెల్లించకపోవడం ఏంటని ప్రశ్నించారు. వ్యవసాయరంగాన్ని సంక్షోభంలోకి నెట్టి....రైతు బతుకులను జగన్ దినదినగండంగా మార్చారని మండిపడ్డారు. రైతు దినోత్సవం అంటే....ప్రశ్నించిన అన్నదాతలను అవమానించడమా అని నిలదీశారు. ఎమ్మెల్యే తక్షణమే రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్నదాతలకు అండగా తెలుగుదేశం పోరాడుతుందని ట్విట్టర్ లో హెచ్చరించారు. ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావుకు సంబంధించిన వీడియోను ట్వీట్‌కు జతచేశారు.
కారుమూరి నాగేశ్వరరావుకు "అన్నదాతలంటే అంత అలుసా : లోకేశ్
ధ్యానం కొనుగోళ్ల పెండింగ్ బకాయిలు చెల్లించమన్న రైతులను ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు బెదిరించడంపై నారా లోకేశ్ మండిపడ్డారు. అధికారమదంతో విర్రవీగుతూ రైతుల్నే బెదిరిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుపై నారా లోకేశ్ ఆగ్రహం